మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 29 పందలపాక, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో తుఫాను ప్రభావంతో వరిచేన్లు నేలమట్టం అయ్యాయి. సుమారు 80 శాతం వరిచేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ,డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ‘మొంథా’ తుఫాను ప్రభావంతో వరిచేన్లు నేలమట్టం అయ్యాయి. రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, నాయకత్వంలో అమలైన ‘రైతు భరోసా’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పంట నష్టాన్ని భరిస్తూ, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ (క్రాప్ బుకింగ్)ను సక్రమంగా నిర్వహించేది.
పంటల నష్టం కారణంగా అప్పుల ఊబిలో పడిన రైతులు కూడా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కౌలు రైతుల పంట నష్టానికి తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు భరోసా కల్పించడం, ఇన్సూరెన్స్ సాయం సమర్థవంతంగా అందించడం తక్షణ అవసరం.
రైతుల కష్టాలను తగ్గించేందుకు, ఆర్థిక నష్టాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రాథమిక చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి (అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి), సత్తి హరిప్రసాద్ రెడ్డి(గ్రామ శాఖ అధ్యక్షులు), పోతుల వరప్రసాద్ రెడ్డి (బుజ్జి)(బిక్కవోలు మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్), బొడ్డు ముత్యాలరావు (వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ), రొంగల అప్పాజీ(అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు), లపతి సత్యనారాయణ(మాజీ జడ్పీటీసీ), పాలచర్ల అబ్బు, గండి వాసు, గొలుగూరి సత్యనారాయణ రెడ్డి, మచ్చ బుజ్జి, కర్రి ఇస్రారెడ్డి, పడాల వీర రాఘవ రెడ్డి, గోరపల్లి సీతారామయ్య, వంక శీను, నల్లమిల్లి సుబ్బారెడ్డి, మల్లిడి తాత కాపు, గొరపల్లి మల్లేష్, వెంకటేష్ మాడెం(పంచాయతీ 14వ వార్డు సభ్యులు), వీర్రాజు కోసూరి, శ్రీను ఇల్లపు, పెంటకోటి శ్రీను, పడాల దుర్గారెడ్డి, కర్రి మణికంఠ తదితర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


