Balaramakrishna : ప్రజా నాయకుడు భక్తుల బలరామకృష్ణ రైతుల కోసం కృషి

TRINETHRAM NEWS

మొంథా తుఫాను వలన వర్షాలకు తడిచిన వరి దుబ్బులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల

పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకొంటుంది భయపడవద్దు

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 29, రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో తుఫాను వలన కురుస్తున్న భారీ వర్షాలకు తడిచిన వరి దుబ్బులను పరిశీలించి, పంట నష్టాన్ని పరిశీలించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడ నిర్వాసితులకు అందుతున్న వైద్య మరియు ఇతర సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన బోజనాలను దగ్గరుండి వడ్డించారు.
అనంతరం రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గత మూడు,నాలుగు రోజులుగా అకాల వర్షాలు పకృతి వైపరీత్యం, తుఫాన్ సంభవించిన నేపథ్యంలో ఎడతెరగని వానలు కురవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వరుస తుఫాన్లు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన పరిస్థితి. రైతాంగం పంట చేతికొచ్చిన సమయంలో రాజానగరం మండలంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు నేలకొరగడం జరిగింది. నేడు నరేంద్రపురం గ్రామంలో పరిశీలించడం జరిగింది. మొత్తంగా 300 ఎకరాలు పంట నష్టం వచ్చినట్లుగా అంచనా వచ్చింది.

రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుండి ఇవాళ ఎటువంటి విపత్తు జరిగిన కూడా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది . అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి తప్పనిసరిగా రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రైతులందరికీ సంపూర్ణమైన హామీ ఇస్తూ, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు భరోసాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం ఎంపీడీఓ, ఎమ్మార్వో , వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Balaramakrishna Working for Farmers

You cannot copy content of this page

Scroll to Top