దేశంలో అత్యంత ధనవంతుడు

TRINETHRAM NEWS

దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.

దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ(Mukesh ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటివల తన కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక(wedding) జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.

అంబానీ బర్త్ డే, అనంత్ పెళ్లి వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితం(Jio recharge free)గా అందించారని, ఇది 30 రోజులపాటు ఉంటుందని పేర్కొంటూ ఒక పోస్ట్ లింక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియా(social media)లో ప్రచారం చేస్తున్నారు. జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ ప్రకటించిందని, మరో మూడు రోజుల్లో ఇది ముగుస్తుందని పలువురు చెబుతున్నారు.

You cannot copy content of this page

Scroll to Top