WhatsApp Image 2024 03 13 at 08.36.15
Trinethram News : Mar 13, 2024,
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టరేట్ లో 1950 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
