Son Killed Father : పోటీ పరీక్షల ఒత్తిడి.. తండ్రిని అత్యంత దారుణంగా చంపేసిన కొడుకు

TRINETHRAM NEWS

చదువు ఉద్యోగంపెళ్లి *పిల్లలు..

తల్లిదండ్రులు ఒత్తిడి చేయని సందర్భం ఏదైనా ఉందా? ముందు చదువుకో.. మంచి లైఫ్ వస్తుందంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోమంటారు. ఆ తర్వాత పెళ్లైతే కానీ సెటిల్ కావు అంటారు. ఆ తర్వాత మరి మాకు మనుమడో మనుమరాలో ఎప్పుడు ఇస్తున్నావ్ అంటారు. అసలు వీళ్లు ఒత్తిడి చేయని సందర్భం ఉంటుందా?

ఇంకో విషయం.. తల్లిదండ్రులు సమాజంలో కాస్త పలుకుబడి, డబ్బు కలిగిన వారైతే.. ఆ పిల్లల మీద ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే సంఘటన కూడా అలాంటిదే.

తండ్రి ఒక పాథాలజీ ల్యాబ్ ఓనర్.. ఊరిలో గొప్ప గుర్తింపు. కొడుకు బీకాం పాసై ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. నిత్యం కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ రాయమని తండ్రి పోరు. ఒత్తిడి భరించలేని ఆ టీనేజర్.. ఏకంగా తండ్రిని తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత శవా*న్ని ముక్కలు చేసేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్‌కు ఆకాశ్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు. మన్వేందర్ వర్దమాన్ పాథాలజీ అనే ల్యాబ్‌కు ఓనర్. ఇక కొడుకు ఆకాశ్ ప్రతాప్ సింగ్ బీకాం పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నెల 20న పోటీ పరీక్షల విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. కోపంలో తండ్రిని తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత వాళ్లింట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌‌లో ఖాళీగా ఉన్న గదిలోకి తండ్రి శవాన్ని తీసుకెళ్లి.. ముక్కలుగా కోసేశాడు. కొన్ని ముక్కలను దగ్గర్లోని సదోర్న అనే గ్రామంలో పడేశాడు. కొన్నింటిని ఇంట్లోనే ఒక డ్రమ్ములో వేశాడు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో కొడుకును ప్రశ్నిస్తే.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో శవానికి సంబంధించిన పీస్‌లు కూడా దొరికాయి.
ఇదీ జరిగిన సంగతి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The son who killed his father

You cannot copy content of this page

Scroll to Top