Nenavath Balu Naik : పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించాలి

TRINETHRAM NEWS

నేనావత్ బాలు నాయక్
దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో చందంపేట మండలంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికై జిల్లా అందనపు కలెక్టర్, ఆర్డీఓ మరియు ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించ విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

చిన్నచిన్న సమస్యలను సాకుగా
చూపించి సమస్యను జఠిలం చేయవద్దని ఆటవీశాఖ అధికారులకు సూచించారు.

దేవరకొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పోగిళ్ళ,కంబాల పల్లి గ్రామ రైతులు సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జెయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్, RDO రమణా రెడ్డి, ఫారెస్ట్,రెవెన్యూ అధికారులు మరియు వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The poor should be

You cannot copy content of this page

Scroll to Top