అల్లూరిజిల్లా అనంతగిరి, త్రినేత్రం న్యూస్ జూలై 9 : అనంతగిరి మండలంలోని గ్రామాల పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం. గిరి గ్రామ సీమల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణలో ఎనలేని కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ (ఐవీఆర్) ద్వారా ఇచ్చే అభిప్రాయాల ఆధారంగానే ఉద్యోగ భద్రత, జీత భత్యాల పెంపు వంటి కీలక అంశాలు నిర్ణయించనుంది.
జనసేన నేత మండల అధ్యక్షుడు చిట్టం మురళి మాట్లాడుతూ, “సమాజం కోసం పనిచేసే కార్మికుల పట్ల గౌరవ భావంతో మెలగాలి. వారి సేవలపై మీరు ఇవ్వనున్న సమాధానాలు వారి భవితవ్యం నిర్ణయించబోతున్నాయి,” అని ప్రజలను కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


