CPI : మెరుగైన చికిత్సకై కార్యకర్తకు కూనంనేని ఎల్ఓసీ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవకలాపూర్ సిపిఐ గ్రామ శాఖ కార్యకర్త భయ్యా శ్రీను కుమారుడు భయ్యా వంశీ చైతన్య కీళ్ల నొప్పులతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స ఖర్చుతో కూడుకోవడంతో మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ను కలిసి విషయం చెప్పగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్త కుమారునికి మెరుగైన చికిత్స కోసం 2,50,000 /- రూపాయల విలువగల ఎల్ఓసి సాంక్షన్ చేసి పార్టీ కార్యకర్త కుటుంబానికి భరోసా కల్పించారు.

సంభంధిత ఎల్ఓసీ ని గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ చేతుల మీదుగా బయ్య శ్రీనుకు అందజేశారు.కుమారుని వైద్యం కోసం భరోసా నిచ్చిన సాంబశివరావు కు శ్రీను ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి, సహాయ కార్యదర్శి ఎనమల్ల నవీన్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kunamneni LOC for better treatment

You cannot copy content of this page

Scroll to Top