Rama Rajesh Khanna : తెలంగాణ రాష్ట్రంలో బానిసల కన్నా హీనంగా చూస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసి కాంట్రాక్ట్ పద్ధతి లో కొనసాగించాలి

TRINETHRAM NEWS

ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

వరంగల్ త్రినేత్రం ప్రతినిధి… తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారయ్యాయని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్బన్ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్టు పద్దతి లోవిధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి పదివేల రూపాయల జీతభత్యాలు ఇచ్చేవారు, 5 సంవత్సరాలు వరుసగా విధులు నిర్వహించిన ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ జీతభత్యాలు పెంచాలని తీర్మానం చేసి ఉన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిని కాంట్రాక్ట్ పద్ధతి నుంచి తొలగించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను చేర్చడం జరిగినది, నాడు ఇస్తున్న జీతాలు పదివేలకు పైగా పెరుగుతాయని ఆశలు పడ్డ ఆ ఉద్యోగులకు నోటిలో మట్టి కొట్టడం జరిగినది ఉన్న జీతాలు ఇవ్వకుండా వాటిని తగ్గించే దిశగా నేడు కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయడం అందుకు కేంద్ర ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇందుకు సహకరించడం దురదృష్టకరమని, పనిచేస్తున్న ఉద్యోగులకు ఆశలు అడియాశలు చేస్తున్నారని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రామ రాజేష్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 28వ తారీకు వరంగల్ లో సి కే ఎం హాస్పిటల్ ప్రాంగణంలో భారీ ఎత్తున జరిగిన సదస్సులో రామ రాజేష్ ఖన్నా 5 సంవత్సరాలు పైగా పనిచేసిన వారిని రెగ్యులరేషన్ చేస్తూ జీతలు పెంచాలని గత నాలుగు నెలల నుండి ఆగిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాత్రిపూట వాచ్మెన్ గా ఉన్న వ్యక్తిని తెల్లవారు కూడా స్వీపర్గా, హెల్త్ క్యాంపన్ సర్వర్, గా ఒకే వ్యక్తితో తోటమాలిగా పెట్టి చాకిరీ చేయించడం దురదృష్టకరం రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాసిన వ్యక్తిని తెల్లవారుజామున కూడా నిద్ర లేకుండా చేయడం బాధాకరమని అలాంటి పద్ధతిని తక్షణమే మానుకోవాలని హెచ్చరించడం జరిగినది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The outsourcing system of urban primary health centers

You cannot copy content of this page

Scroll to Top