NHM : డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.అనిత కు వినతి పత్రం ఇచ్చిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ ఆరోగ్య మిషన్ పనిచేస్తున్న ఉద్యోగులకు 3 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. అనిత కు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ (ఏఐటీయూసీ అనుబంధం) ఎంప్లాయిస్ యూనియన్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు యాదవ్ మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన 3 నెలల వేతనాలు అనగా సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని, కాంటిజెంట్ వర్కర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 15600 రూపాయలు చెల్లించాలని, అలాగే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అకౌంటెంట్లకు, పీ.హెచ్.సి. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ,పబ్లిక్ హెల్త్ మేనేజర్ కు జీవో నెంబర్ 1195 ప్రకారం 19,500 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏ.ఎన్.ఎం.కళావతి మాట్లాడుతూ…

ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలని ,మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల వెంటనే పరిష్కరించాలని , లేనిఎడల ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 20 డిసెంబర్ 2025 నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్.సీ.డీ.అరుణ్, డీ.పీ.ఓ.శాంతి , ఏం.ఎల్. హెచ్.పీ. తేజ , స్టాఫ్ నర్స్ రజిత, ఏ.ఎన్.ఎం.లు రాజా లక్ష్మీ, ఉమాదేవి, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

D.M. and H.O. NHM employees who gave petition to Dr. Anita

You cannot copy content of this page

Scroll to Top