గనులు, డిపార్ట్మెంట్ లలో అధికారుల కు వినతి పత్రాలు ఇచ్చిన ఏఐటియుసి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో గనులు, డిపార్ట్మెంట్స్ , ఓసిపి 5 లలో అధికారుల కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను లు పేర్కొన్నారు. సోమవారం జిడికె 2వ ఇంక్లైన్ లో మరియు ఏరియా హాస్పిటల్ లలో వారు అధికారుల కు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్ముడైన గాంధీ జయంతి అక్టోబర్ 2న రావడం దసరా పండుగను అత్యంత వైభవంగా సింగరేణి ఉద్యోగులు జరుపుకొనుటకు ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. పండుగ రోజున గనుల పైన మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ సంవత్సర కాలమంతా నిర్దేశిత లక్ష్యసాధనలో మాకు ఎటువంటి ప్రమాదములు జరగరాదని భావోద్వేగంతో, భక్తి పారవశ్యంతో అమ్మవారిని కోరుకుంటారని వారు తెలిపారు.
ఆ సందర్భంగా అమ్మవారి మొక్కు తీర్చునప్పుడు మద్యం ప్రధాన భూమిక పోషిస్తుందని , పూజకు సంబంధించిన అవసరమైన ప్రధాన వనరులు అక్టోబరు రెండు తారీకున మహాత్మాగాంధీ జయంతి కారణంగా నిషేధించ బడినవని వారు తెలిపారు. అందువల్ల ఉద్యోగుల కోరికను మన్నించి యాజమాన్యం సహృదయంతో ఆలోచించి కార్మికుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 2 తారీఖున వచ్చిన దసరా పండుగను అక్టోబర్ 3వ తారీకు కు మార్చాలని సింగరేణి లో కార్మిక వర్గం కోరుతున్నారని వారు తెలిపారు. ఇట్టి విషయం లో సింగరేణియులందరూ కూడా యాజమాన్యం కు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా లేదా వారికి అవకాశం ఉన్న అన్ని సందర్భాలలో దసరా పండుగ తేది ని మార్చాలని యాజమాన్యం దృష్టికి తీసుకరావడం జరిగిందని వారు పేర్కొన్నారు.
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి గుర్తింపు సంఘంగా ఇదివరకే ఉద్యోగుల మనోభావాలను, భక్తి పారవశ్యాలను దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం కు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగిందని , దసరా సమీపిస్తున్న వేళ మరొకసారి ఉద్యోగుల మనోభావాలను దసరా పై ఉద్యోగులకు ఉన్న మక్కువను యాజమాన్యం దృష్టికి మరొకసారి విజ్ఞాపన పత్రాల ద్వారా అన్ని గనులు, డిపార్ట్మెంట్ల ఉద్యోగుల ద్వారా పంపిస్తున్నామని వారు తెలిపారు. యాజమాన్యం ఉద్యోగులకు ఇచ్చిన నిర్దేశిత లక్ష్యాలను గత దశాబ్దాల కాలము నుండి ఏనాడు ఏమర పాటు కూడా నిర్లక్ష్యం చేయకుండా సాధిస్తున్నారని వారు తెలిపారు. ఈ సంవత్సరం కూడా నిర్దేశిత లక్ష్యాలను సాధించుటకు ఉద్యోగులందరూ కంకణ బద్ధులై ఉన్నారని, ఇప్పటికే కోల్ ఇండియాలో వివిధ రాష్ట్రాలలో ఉన్న బొగ్గు సంస్థలు దసరా తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారని వారు గుర్తు చేశారు.
ఇట్టి అవకాశం యాజమాన్యం కల్పించినట్లయితే ఉద్యోగులకు కూడా సంస్థ పైన విశ్వాసం పెరిగి పరస్పర అవగాహనతో ముందుకు వెళుతూ నిర్దేశిత లక్ష్యసాధనలో అన్ని వర్గాల ఉద్యోగులు మమేకమై ఉంటారని వారు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సిద్దమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి,పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, ఎరవెల్లి రాజయ్య, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి, నాయిని శంకర్, గొడిశల నరేశ్, ఎం.చక్రపాణి, చెప్యాల భాస్కర్, బలుసు రవి, దొంత సాయన్న, బండి మల్లేష్ బి.సమ్మయ్య, దాసరి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, ఆర్ వెంకట స్వామి, ఎం.సత్యనారాయణ, దాసరి అనిల్, సంతోష్, బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


