పెద్దపల్లి జిల్లా 17 సెప్టెంబర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి, సుమారు 3 వేల మందికి పైగా ఉద్యోగులు జీవితాల్లో వెలుగు నింపిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ను పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి బుచ్చిబాబు సన్మానించడం జరిగింది
1195, 1187 జి.ఓలు.ను ప్రభుత్వంతో ధర్నాలు చేసి వినతి పత్రం ఇస్తూ ఎవరికైతే 510 జీవో మిస్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారి కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు గురించి సుమారుగా 5 సంవత్సరాలు కష్టపడి అందరు అధికారులను, ఒప్పించి, మెప్పించి, సుమారు 3 వేల మందికి పైగా ఉద్యోగులు జీవితాల్లో వెలుగు నింపిన వీరుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కు పెద్దపల్లి జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రతినిధులు బుచ్చిబాబు సన్మానించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల్లో జీవో తీసుకొచ్చిన ముఖ్యపాత్ర పోషించిన రామ రాజేష్ ఖన్నా ఫ్లవర్ బొకే మరియు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


