MLA Balu Naik : పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా ఆదుకుంటా

TRINETHRAM NEWS

ఎం ఎల్ ఏ బాలు నాయక్

దేవరకొండ మే 28 త్రినేత్రం న్యూస్. 743 మంది మల్టిపర్పస్ వర్కర్లకు 10లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే బాధ్యత నాది. ప్లాస్టిక్ నియంత్రణ నిర్మూలన మన అందరి బాధ్యత. పారిశుధ్య కార్మికులతోనే గ్రామాల పరిశుభ్రత. పంచాయతీ కార్యదర్శి అంటేనే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి. వచ్చే జూన్, జూలై నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు.

కొండమల్లేపల్లి* మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు మరియు పారిశుధ్య కార్మికులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి,అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవరకొండ నియోజక వర్గంలో ఉన్న 743 పారిశుధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. ప్లాస్టిక్ నియంత్రణ నిర్మూలన మన అందరి బాధ్యత. పారిశుధ్య కార్మికులతోనే గ్రామాల పరిశుభ్రత.

తడిచేత్త పొడి చెత్త ప్రజల నుండి సేకరించి, ప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డ్ లో వేయాలి. అర్హత కలిగిన ప్రతి పారిశుధ్య కార్మికుల కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చి వారిని ఆదుకుంటాం అని అన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు. గ్రామస్తులు శ్మశానవాటికలో అంత్యక్రియల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

పంచాయితీ కార్యదర్శులు, కార్మికులు చేసే ఉద్యోగం నాయకుల కోసం కాదని, ప్రజల కోసం నిజాయతీగా పని చేస్తే మీకు తోడుగా నేను ఉంటానని,మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,DLPO శంకర్ నాయక్,MPDO బాల రాజు రెడ్డి,MPO లు సన్ని అబ్రహం,కొండల్ రెడ్డి, సుదర్శన్,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మేకల శ్రీనివాస్ యాదవ్,ప్రతాప్ రెడ్డి, తెర సత్యం, మాజీ జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,NSUI నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government will provide

You cannot copy content of this page

Scroll to Top