Press Club : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలం,భవన నిర్మాణం కొరకు వినతి పత్రం

TRINETHRAM NEWS

బాలానగర్ తాహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ ప్రభుదాస్ కి అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 28 : కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గం సభ్యులతో కలిసి బాల నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రెస్ క్లబ్ స్థలం, భవన నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ భూమిలో స్థలాన్ని కేటాయించాలని, ఎమ్మార్వో శ్రీనివాస్,డిప్యూటీ తహసిల్దార్ ప్రభుదాస్ కి వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో, డిప్యూటీ తాహసిల్దార్ వినతి పత్రంపై మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యాలయం భవన నిర్మాణానికి పై అధికారులను సంప్రదించి, త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఎమ్మార్వో, డిప్యూటీ తాహసిల్దార్ హామీపై ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, వి.సుజాత,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.లక్ష్మి,ఈసీ మెంబర్ రవీందర్ రెడ్డి,కర్ణ కుమార్, అనిల్ కిషోర్, వీర శేఖర్ రెడ్డి,శైలజ, సునీతా రాణి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukatpally Press Club land

You cannot copy content of this page

Scroll to Top