మాజీ ఎం ఎల్ సి అలుగుబెల్లి నర్సి రెడ్డి.
డిండి (గుండ్ల పల్లి) మే 28 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ బడులను అభి వృద్ధి చేయాలని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ,మాజీ ఎం ఎల్ సి అలుగుబెళ్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో అంతరాలు లేని నవ సమాజాంకోసం ప్రజలందరూ పాటుబడుదాం అనే ధృడ సంకల్పంతో నిర్వహిస్తున్న ప్రచార జాత రెండవరోజు డిండి మండల కేంద్రానికి చేరుకుంది.
ఈ సందర్భంగా అలుగుబెల్లీ నర్సిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అంతరాలు లేని విద్య ఏర్పడాలంటే పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవడం ద్వారా అది సాధ్య పడుతుందని అన్నారు. ప్రవేట్ బడులలో లక్షలు పోసి చదువుతున్నటువంటి విద్యార్థి , ప్రభుత్వ బడిలో ఎలాంటి ఫీజు లేకుండా చదువుతున్న పేద విద్యార్థికి అంతరం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామారావు. వి శ్రీను, ఎం డీ రహ్మ తుల్ల, డీ నారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్, తిరు పతయ్య, వి,యాదయ్య, కే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


