MLA Balu Naik : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా

TRINETHRAM NEWS

ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. నిత్యం ప్రజలకుపల్లె పల్లెనా ప్రగతి పరుగులు..! పేదోడి ఆత్మగౌరవం..ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం…!! పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..! ప్రలోభాలకు,పైరవీలకి తావు ఉండకూడదు…!!
ఇంటి నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ. కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే మన ప్రజా ప్రభుత్వం లక్ష్యం. నేరేడుగొమ్ము* మండల కేంద్రంలో మరియు తిమ్మాపురం,కొత్తపల్లి, పెద్దమునిగల్ గ్రామాలలో 97 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

అనంతరం నేరేడుగోమ్ము మండల కేంద్రంలో 143 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వ పాలనలో పల్లె పల్లెనా ప్రగతి పరుగులు తీస్తుంది అని అన్నారు.ప్రజా అవసరాల కోసం ఊరూరా సిసి రోడ్లు, ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నాం.

ప్రతీ గ్రామంలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తానని అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను అని అన్నారు.

ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లే అవసరం లేకుండా దేవరకొండలో ఉన్న 100పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా చేసి,పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం అని అన్నారు.

భార‌తదేశంలోనే నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన కని,విని ఎరుగని పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్ష‌ల‌ రూపాయలతో సంవ‌త్సరానికి పెద్ద ఎత్తున 4.50 ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.

రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరి ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్తత్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి శ్రీ‌కారం చుట్టింది అని అన్నారు. పైల‌ట్ ప్రాజెక్ట్ గ్రామాలల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా చురుగ్గా సాగుతున్నాయి అని అన్నారు.

అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి త‌క్కువ ఖ‌ర్చు, నాణ్య‌త‌తో ఇండ్ల‌ను నిర్మించ‌డానికి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేయడం జరిగింది.ఈ అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించి ల‌బ్దిదారుల‌కు అవ‌గాహ‌న కల్పించాలి అని అన్నారు.

అనంతరం పలు వివాహా శుభకార్యాలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,మహిళా సంఘాల నాయకురాలు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I will always be available

You cannot copy content of this page

Scroll to Top