Illegal Arrests : అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేరు

TRINETHRAM NEWS

ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసినా రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ జూలై 04 త్రినేత్రం న్యూస్. నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్వి నాయకులు అరెస్ట్

అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేరు అని బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ లు అన్నారు. శుక్రవారం నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్వి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసినా రేవంత్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పిండో తక్షణమే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధపాలన కొనసాగిస్తున్నాడు అని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, యువజన విభాగం అధ్యక్షుడు పొట్ట మధు ,SK జామీర్ బాబా తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government cannot continue

You cannot copy content of this page

Scroll to Top