ఎమ్ఎస్ఎంఈల స్థాపనతో యువతకు ఉపాధి….
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 31. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట.. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ఆత్రేయపురం డి ఆర్ డి ఏ వెలుగు కార్యాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్ఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ఆర్డీవో శ్రీకర్,డీఆర్డీఏ పీడీ సాయి జయచంద్ర, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు,పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎమ్ఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్,నాబార్డ్ బ్యాంకు మేనేజర్ స్వామి నాయుడు, ఎంపీడీవో వెంకట రమణలతో కల్సి పాల్గొన్నారు. స్థానికంగా లభిస్తున్న ముడి సరుకులతో వ్యాపార యూనిట్లను నెలకొల్పడం వల్ల ఉపాధి లభిస్తుందన్నారు.
గ్రామీణ ప్రాంత యువతీ,యువకులు, రైతులు మహిళలు మెరుగైన ఉపాధి అవకాశాలు పొంది స్వయం శక్తితో రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర మొదలైన యూనిట్ల వల్ల గుర్తింపు లభించిందని, వ్యాఖ్యానించారు. మన చుట్టూ లభించే ముడి సరుకు, వనరులకు అనుగుణమైన పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలు, పొందవచ్చని,తమతో పాటు మరింతమందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువకులు, మహిళలు, రైతులు గ్రామీణ హస్త కళాకారులను ప్రోత్సహిస్తూ మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని, ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


