MLA Jare : పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది -జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో దుబ్బ బుల్లెమ్మ ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ,మాజీ సర్పంచ్ రవి ,సురభి రాజేష్, కటికనేని ఆదిత్య, మడకం శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

possible only by the Congress government

You cannot copy content of this page

Scroll to Top