హాజరైన సోషల్ వెల్ఫేర్ స్టాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ
కూకట్పల్లి నవంబర్ 16 (త్రినేత్రం న్యూస్) : స్వరాభిషేకం ఆర్గనైజర్, ఫౌండర్, అడ్మిన్ శ్రావ్య శృతి నల్లూరి, ప్రేకాస స్టూడియో అధినేత సబిత మట్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా స్వరాభిషేకం స్వరోత్సవం.
హాజరైన సోషల్ వెల్ఫేర్ స్టాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ.స్వరాభిషేకం ఆర్గనైజర్ ఫౌండర్ అడ్మిన్ శ్రావ్య శృతి ఆధ్వర్యంలో స్వరాభిషేకం స్వరోత్సవం కార్యక్రమం కూకట్పల్లి లోని ప్రేకాస స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరఒకే సింగింగ్ మీట్ 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, ప్రముఖ గాయకుడు సీనియర్ జర్నలిస్ట్ బి.వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
గాయకులు పలువురు తన గాన, గంధర్వ, కంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ ఆధ్వర్యంలో స్వరాభిషేకం స్వరోత్సవం కరవోకే సింగింగ్ మీట్ 2025 కార్యక్రమం స్వరాభిషేకం ఆర్గనైజర్ ఫౌండర్ మరియు అడ్మిన్ శ్రావ్య శృతి నల్లూరి అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. కరవోకే సింగింగ్ మీట్ 2025 కార్యక్రమంలో సీనియర్ గాయకుల నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మధురమైన గానాలను ఆలపించి మానసికోత్సవాన్ని, ఉల్లాసాన్ని కలిగించారని కొనియాడారు. ఇదిలా ఉండగా స్వరోత్సవం కార్యక్రమం 2025 పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన ప్రముఖ సింగర్ ఎన్నారై శ్రీ దివ్య సుర్నిది కి ఘన సత్కారం జరిగింది. కరవోకే సింగింగ్ మీట్ 2025 కార్యక్రమంలో వి ఎస్ టి జనరల్ మేనేజర్ వెంకటేశ్వర రావు, సంతోష్, అవుగన నాగభూషణ్, జన విగ్నేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉష, రిటైర్డ్ ఆఫీసర్ రామకృష్ణ, వినయ్, కార్తికేయ, నరహరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వరాభిషేకం 8వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆర్గనైజర్, ఫౌండర్ మరియు అడ్మిన్ శ్రావ్య శృతి ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావ్య శృతి మరియు పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎన్నారై శ్రీ దివ్య సుర్నిది, సీనియర్ జర్నలిస్ట్ బి.వెంకటేశ్వర్లు మరియు గాయకులను టీం స్వరాభిషేకం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇది ఇలా ఉండగా స్వరాభిషేకం స్వరోత్సవం కార్యక్రమానికి ప్రేకాస స్టూడియో అధినేతలు ప్రేమ్, సబిత మట్ల లు అమూల్యమైన సహకారాన్ని అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


