బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ సెప్టెంబర్19 త్రినేత్రం న్యూస్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం పిఏపల్లి మండలం తిరుమలగిరి,గుడిపల్లి మండలంలోని జి.బీమనపల్లి గ్రామల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ లో చేరిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


