Chandana Nageshwar : మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో

TRINETHRAM NEWS

పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు

విద్యాభ్యాసం ప్రైవేటీకరణ వసూలు, వసూళ్లు పెంచుకోవడానికి?

పేద విద్యార్థులు పాలేరులేనా? చదువుకు నోసుకోకూడదా?

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుంది….
….చందన నాగేశ్వర్

వైఎస్సార్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.మాజీ ఎంపీ భరత్ , ఆధ్వర్యంలో భరత్ ఇంటి వద్ద నుంచి 19న ఛలో మెడికల్ కాలేజీ నిరసన చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది..
ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ…వైసిపి హయాంలో 17మెడికల్ కాలేజీలు తీసుకు రావడం, వాటిని కూటమి ప్రభుత్వం పిపిపి పేరుతొ ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న నేపథ్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం పోలీసుల అడ్డుకోవడం చాలా దారుణమని.
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించతలపెట్టింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వంటి ప్రాంతాలలో 2023-24 నుంచే ఇవి ప్రారంభమయ్యాయి. కాలేజీల నిర్మాణం ద్వారా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 2,360 నుంచి 4,910కి పెంచాలనేది జగన్ ప్రభుత్వ లక్ష్యం. ఈ కాలేజీలలో సగం సీట్లను ఉచితంగా, మిగిలినవాటిని ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే తక్కువ రుసుముతో అందించాలని నిర్ణయించారు. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని జగన్ భావించారు.
అని అన్నారు…2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈ 17 కళాశాలలలో పదింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతో పనిచేస్తాయని, దీనివల్ల వైద్య విద్య రుసుములు గణనీయంగా పెరిగి, నిరుపేద విద్యార్థులకు అవకాశాలు తగ్గుతాయని చందన నాగేశ్వర్ అన్నారు.
పీపీపీ మోడల్ ద్వారా ఈ కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, ఆరోగ్యశ్రీ పథకం బలహీనపడుతుందని ఆయన ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Under the leadership of former

You cannot copy content of this page

Scroll to Top