MLA Gorantla : మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

సాటిలైట్ సిటీ, హుకుంపేట గ్రామాలలో కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల
త్రినేత్రం న్యూస్ : మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పడుతూ, మహిళా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు సాటిలైట్ సిటీ, హుకుంపేట గ్రామాలలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించుటలో భాగంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన (టైలరింగ్) కుట్టు మిషన్ కేంద్రాలను ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి చేకూర్చే అనేక పథకాలను నిర్వీర్యం చేసిందని, మహిళలకు అందించే కుట్టు మిషన్లు అనేక రకాల పరికరాలు గోడౌన్లకి పరిమితం చేసి ప్రజలకు అందించకుండా పరికరాలను నాశనం చేశారని అన్నారు.

మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా సాటిలైట్ సిటీ సెంటర్ నందు 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేసామని, అలాగే హుకుంపేట సెంటర్ నందు 130 మంది లబ్ధిదారులను ఎంపిక చేసామని వీరందరికీ 90 రోజులపాటు శిక్షణ అందించి, అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ అందించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ శిబిరం నందు ట్రైనింగ్ తీసుకునే వారందరూ నైపుణ్యాన్ని బాగా పెంపొందించుకోవాలని, నేటి తరానికి అనుగుణంగా మోడరన్ గా కుట్టే విధంగా శిక్షణ పొందాలని, కచ్చితంగా విధిగా హాజరై శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన గ్రామాల్లో కూడా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కుట్టు మిషన్ మాత్రమే కాకుండా ఇంటి వద్దనే ఉంటూ అనేక రకాల చేతివృత్తుల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పెంపొదించుకొనే విధంగా కార్యాచరణ జరుగుతుందని అన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల వారు మగవారి సంపాదన మీద మాత్రమే ఆధార పడకుండా వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు మహిళలు స్వయం ఉపాధి సంపాదించుకునే విధంగా ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, అలానే డ్వాక్రా సంఘాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు లోన్లు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా మహిళా సంఘాలకు 10 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందిస్తుందని మహిళలు వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి చూపించే విధంగా ఆలోచన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఎం.పీ.డీ.వో డి.శ్రీనివాసరావు, పండూరి అప్పారావు, మట్ట శ్రీను, దార అన్నవరం, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పిన్నింటి ఏక బాబు, పెండ్యాల రామకృష్ణ, పిల్ల తనుజ, మండ బిందు, బైరెత్తి సరోజిని, బొప్పన శ్రీను, ఎలమాటి రామకృష్ణ, నిచ్చెనకోళ్ల సత్తిబాబు, పంచాయతీ కార్యదర్శులు టి.కృష్ణ, కాశీ విశ్వనాథ్, ఐ.టి.డి.పి సభ్యులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition government is working

You cannot copy content of this page

Scroll to Top