వైఎస్సార్సీపీ మాజీ సీఎం జగనన్నను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్
మండల ఆత్మీయ సమావేశాలపై మాజీ మంత్రి వేణును అభినంధించిన జగనన్న
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29, త్రినేత్రం న్యూస్ : తాడేపల్లిలో మంగళవారం మాజీ సీఎం, వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గానికి సంబంధించి సంస్థాగత పటిష్టత, సమన్వయం అంశాలపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గూడూరి తో కాసేపు ముచ్చటించారు. పార్టీ విషయాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రతీ వారం.. వారం ఒక్కో మండలంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమాల వల్ల కార్యకర్తల్లో స్థైర్యాన్ని పెంచిందని, సంస్థాగత జాగృతి పెంచేందుకు దోహద పడిందని డాక్టర్ గూడూరి జగనన్న దృష్టికి తీసుకు రావడంతో ఈ సందర్భంగా జగనన్న అక్కడే వున్న మాజీ మంత్రి వేణును అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మోడల్ గా తీసుకుని రాష్ట్రమంతా నిర్వహించేలా చేస్తే బావుంటుందని జగనన్న ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


