MLA Gorantla : పేద ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

వైద్య ఖర్చులు భారమైన ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తుందన్న ఎమ్మెల్యే గోరంట్ల

పేద ప్రజలకు మరింత చేరువుగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ధవలేశ్వరం గ్రామానికి చెందిన కనకనాల కళ్యాణ చక్రవర్తికి 6,36,570/- రూపాయలు, కాతేరు గ్రామానికి చెందిన చిల్లి ఆశిష్ కు 5,00,000/- రూపాయలు, సాటిలైట్ సిటీ సి.బ్లాక్ చెందిన కోణాటి లలితకు 1,52,779/- రూపాయలు, కాతేరు గ్రామానికి చెందిన పిట్ట సత్యనారాయణకు 84,928/- రూపాయలు, వేమగిరి గ్రామానికి చెందిన యాళ్ల అచ్యుతరామయ్యకు 79,211/- రూపాయలు హుకుంపేట గ్రామానికి చెందిన సలగళ్ల వెంకటరావుకు 75,000/- రూపాయలు మరియు ధవలేశ్వరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్త గోరంట్ల రాజు కుటుంబానికి 2,00,000/- లక్షల రూపాయలు మొత్తం కలిపి 17,28,488/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహృదయంతో పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వర్తించని అనేకమంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, నున్న కృష్ణ, పండూరి అప్పారావు, మట్ట శ్రీను, బొప్పన నాగేశ్వరరావు, ముమ్మిడి దేవీ నాగేశ్వరరావు, బొప్పన శ్రీను, బైరెత్తి సరోజినీ, పల్లా రామస్వామి, దొడ్డి బాబ్జి, ఎమ్మెస్సార్ శ్రీను, కొడమంచిలి సూర్య, నాళ్ళ రమేష్, దంగేటి శ్రావణ్, బిక్కిన వెంకటేష్, దాక్షరపు వాసు, ఎల్లపు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition government is

You cannot copy content of this page

Scroll to Top