CPI : భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ ) 20 వ మండల మహాసభ రావణాపల్లి లో ఘనంగా జరిగింది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ( కొయ్యూరు) : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లిలో సీపీఐ పార్టీ 20వ మండల మహాసభ ఎంతో ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం, పార్టీ కార్యదర్శి ఇరువాడ దేవుడు అధ్యక్షతన మరియు ఆధ్వర్యంలో,ముందుగా సీపీఐ పార్టీ జండా ఆవిష్కరణ చేసి , పార్టీ నినాదాలతో రావణాపల్లి గ్రామం మారు మ్రోగింది. చాలా రోజుల తర్వాత సీపీఐ పార్టీ జిందాబాద్, జిందాబాద్ అంటూ కార్యకర్తలు పార్టీ పూర్వ వైభవం తలపించేలా వందల కొద్ది తరలి మహాసభ కు వచ్చారు. అలాగునే మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు మాట్లాడుతూ, ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజల సమస్యలపై ప్రశ్నించే పార్టీ సిపిఐ పార్టీయే అని అన్నారు . ప్రజలు ఈరోజు అన్ని హక్కులు సక్రమంగా పొందుతున్నారంటే ముందుగా సిపిఐ పార్టీ పేరు చెప్పాలి అలాగునే, నేటికీ మన గిరిజనులకు కనీస అవసరాలు అయినా తిండి,గుడ్డ, ఇల్లు మరియు రోడ్లు సదుపాయం లేక కొన్ని, కొన్ని గ్రామాలలో తప్పని డోలుమోతలు.

అలాగునే గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు, మన పార్టీని బలోపేతం చేసి మన సమస్యలపై ప్రశ్నించే ప్రజా ప్రతినిధులను మనం ఎన్నుకొని మనకు రాజ్యాంగం కల్పించిన మన హక్కులను కాపాడుకుందాం.అని దేవుడు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా సిపిఐ పార్టీలో పూర్వం పనిచేసి, మరణించిన కుటుంబాలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉల్లి సూరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి సత్యనారాయణ, అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లి సత్యనారాయణ, రావణాపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ ఇరువాడ సత్యవాణి, రంపచోడవరం కార్యదర్శి జిత్తు కుమార్, గోలు గొండ కార్యదర్శి రాధాకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షులు భవాని, ఉమ్మడి జిల్లా వ్యవసాయ కార్మిక అధ్యక్షుడు శివలింగకొండలరావు, పార్టీ సీనియర్ నాయకుడు యమ్. వి. వి. సత్యన్నారాయణ, ఎమ్. చలపతిరావు, కొమ్మిన తాతాజీ, జగిలే రమణ, మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The 20th Mandal Mahasabha

You cannot copy content of this page

Scroll to Top