అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి…
రైతు భరోసాపై ప్రభుత్వ వైఖరిని చెప్పాలి..
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అంజయ్య నాయక్
డిండి (గుండ్ల పల్లి)మే 25 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ అన్నారు.ఆదివారం డిండి మండలంలోని గదారల్ తండా సిపిఐ గ్రామ శాఖ మహాసభకు అంజయ్య నాయక్ ముఖ్య అతిధిగా హాజరై సిపిఐ జండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వ విధానాన్ని తెలపాలని,రైతులకు ఎన్ని పంటలకు రైతు రైతు భరోసా, ఎన్ని ఎకరాలకు వేస్తారో తేటతెల్లం చేసి రైతులకు రైతు భరోసాపై ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం పెట్టాలివ్వాలని అన్నారు.
జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…
100 ఏళ్ల సిపిఐ ఉద్యమ ప్రస్థానంలో ప్రజల పక్షాన నిలబడి అధికారం లేకున్నా ఉద్యమ పంతాను ఎంచుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టుపార్టీని అందరించాలని అన్నారు. జూన్ 10 వ,తేదీన డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో జరిగే సిపిఐ డిండి మండల మహాసభ జయప్రదం చేసేందుకు శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,మండల కార్యవర్గ సభ్యులు సోమిడి శ్రీనయ్య, గ్రామ కార్యదర్శి మూడవత్ కృష్ణనాయక్,సహాయ కార్యదర్శి మడ్డు పుల్లారెడ్డి,తౌక్లపూర్ శాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూన వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


