
Telugu Desam Party Formation Day : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 29: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో తెలుగుదేశం పార్టీ నలభై నాలుగువ ఆవిర్బా వ దినోత్సవం సందర్భంగా వేడుకలను పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీత రామలక్ష్మిఆ పార్టీకి వెన్నుముక్కగా నిలిచినటువంటి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పట్టణంలో నాలుగు,ఐదు, ఆరు, ఏడు, ఇరవై ఒకటి, ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, ముప్పై ఒకటి, వార్డులలో టిడిపి జెండాను ఆవిష్కరించారు.
ఆమె మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నందమూరి తారక రామారావు స్థాపించిన ఆ పార్టీ తొమ్మిది నెలల్లో నే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు కులం, మతం, భాష పార్టీ భేదం లేకుండా అందించమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

