
Minister Nara Lokesh : గుంటూరు జిల్లా : మార్చి 29: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో తెలుగుదేశం పార్టీ నలభై నాలుగువ ఆవిర్బా వ సభలో మంత్రి నారా లోకేష్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ మన పార్టీ అని అన్నారు.
అదేవిధంగా కార్యకర్తలే నిజమైన నాయకులు అని స్పష్టం చేశారు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు. వాళ్ల సంక్షేమం కోసం రూపాయలు నూట యాబై కోట్లు ఖర్చు చేశామని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలను కొనియాడారు. అహంకారం వద్దు, ప్రజలతో మమేకమై వాళ్ల సమస్యలను పరిష్కరించడమే అసలు రాజకీయం అని ఆయన సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

