TDP Foundation Day : టీడీపీ ఘనంగా ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS
TDP foundation day in a grand manner

TDP Foundation Day : ఏలూరు జిల్లా : మార్చి 29 : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై నాలుగు వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రెడ్డి మరియు గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగాయి. నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి , కొబ్బరికాయలు కొట్టి ఆయన గురించి వివరించి సూచించారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, పార్టీ భేదం లేకుండా అందాయని తెలిపారు. కేక్ కట్ చేసి , లడ్డు మిఠాయిలు అక్కడికి వచ్చిన కార్యకర్తలకు, ప్రజలకు , అభిమానులకు పంచిపెట్టారు.
ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నేళ్లయిన ఇలాగే కొనసాగుతూ ఉండాలని , ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ పార్టీని, ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు కె రమేష్, కార్యదర్శి జయరాజు శ్యామ్, క్లస్టర్ రాజేష్, గంధం రమేష్, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top