Mon. Mar 9th, 2026

Telugu Child Sworn in British Parliament బ్రిటిష్‌ పార్లమెంట్‌లో తెలుగు బిడ్డ ప్రమాణ స్వీకారం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 12, 2026, బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు జీవితకాల సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బుధవారం జరిగిన వేడుకలో సంప్రదాయ ఎరుపు గౌను ధరించి, భగవద్గీతపై ప్రమాణం చేశారు. సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఆయన 25 ఏళ్లుగా బ్రిటన్‌లో సేవలందిస్తున్నారు.

లేబర్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజును ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సిఫార్సుతో కింగ్‌ చార్లెస్‌-3 లైఫ్‌ పీర్‌గా నియమించారు. ఇకపై ఆయనను ‘లార్డ్‌ నాగరాజు ఆఫ్‌ బ్లూమ్స్‌బరీ’గా పిలుస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telugu child sworn in the British Parliament

Related Post

You cannot copy content of this page