కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 30 : ఇటీవల అనెలిప్ గ్రూప్ నుండి సోషల్ సర్వీస్ కేటగిరీ లో కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ కు చెందిన కర్కనాగరాజు బ్రాండ్ ఆఫ్ ఇండియా 2025 అవార్డు అందుకున్న సందర్బంగా వారు ఈ రోజు తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల ని మర్యాద పూర్వకంగా వారి ఆఫీస్ లో కలిసారు. అనంతరం డాక్టర్ గుమ్మడి వెన్నెల మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవాలందించిన పలువురు ప్రముఖులకు అవార్డు అందజేయగా కార్మిక నాయకులు, పిజెఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు కర్కనాగరాజు కు బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తను చేసిన సామాజిక సేవలను గుర్తించి తెలంగాణా రాష్ట్రం నుంచి అవార్డుకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయం అని వారు తెలిపారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.తను చేసిన సేవలకు తగిన గుర్తింపు అవార్డు రూపంలో వచ్చిందని ముందు ముందు అనేక అవార్డులు తెచ్చుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం రాష్ట్ర అధ్యక్షులు వినయ్ కుమార్, కోశాధికారి బాపనపల్లి ప్రమోద్ కుమార్, కార్యదర్శి ప్రభుదాస్, అప్పలరాజు,గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు శాతారీ వినయకుమార్, ఖైరతాబాద్ అధ్యక్షులు సునీల్ కుమార్,కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


