Social Service : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరొక సామాజిక సేవ కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పోలీస్ శాఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చలమనగరం గ్రామంలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చి నివసిస్తున్న గోత్తి కోయలకు ఈ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరొక్కసారి గిరిజన ప్రజలపై ఔదార్యం చూపి వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని వారికి పలు జాగ్రత్తలు చెప్పి అక్కడ నివసిస్తున్న ప్రజలకు గొడుగులు పంపిణీ చేసిన డిఎస్పి సతీష్ కుమార్, ఓ ఎస్ డి జి.నరేందర్ మరియు ములకలపల్లి ఎస్సై కిన్నెర రాజశేఖర్… అదేవిధంగా అక్కడ చదువుకుంటున్న పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరోసారి మానవత్వం చాటుకున్న పోలీస్ శాఖ వారిని గ్రామ ప్రజలు అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another social service program

You cannot copy content of this page

Scroll to Top