BCCI : ఆసియా కప్‌కు టీమిండియా దూరం

TRINETHRAM NEWS

Trinethram News : పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని ప్రకటించింది.

ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కు తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ వెల్లడించి విషయం తెలిసిందే.

అదేవిధంగా పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్‌గా బాధ్యతలో కొనసాగుతున్నారు. దీంతో శ్రీలంక వేదికగా జూన్‌లో జరిగే మహిళల ఆసియా కప్‌తో పాటు.. సెప్టెంబర్‌లో జరగబోయే పురుషుల ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కి సమాచారం అందజేసింది. పాక్‌ను క్రికెట్‌లోనూ ఏకాకి చేసే ప్రయత్నంలోనే బీసీసీఐ మరో అడుగు వేసింది. తాజా నిర్ణయంతో మెన్స్ ఆసియా కప్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంటే.. స్పాన్సర్స్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Team India withdraws from

You cannot copy content of this page

Scroll to Top