
TG SET Results : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 25, త్రినేత్రం న్యూస్. మార్చ్ 24 న విడుదల చేసిన టీజీ సెట్ ఫలితాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల డిండి( గుండ్లపల్లి )విద్యార్థులు తమ ప్రతిభను చూపించారు. ఈ ఫలితాలలో నాలుగో తరగతి విద్యార్థులు ఐదవ తరగతి కోసం పదిమంది వివిధ పాఠశాలల్లో సీట్లు సాధించారు.
స్థానిక ఆర్ పి ఆర్ పి పాఠశాలలో 7 గురు విద్యార్థులు, బీసీ రెసిడెన్షియల్ నాగార్జునసాగర్ లో ఒకరు, దేవరకొండ బీసీ రెసిడెన్షియల్ లో ఒకరు మరియు మన్ననూరు సోషల్ వెల్ఫేర్ లో ఒకరు సీటు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

