
తల్లి ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
Rare Baby Born : త్రినేత్రం న్యూస్ : చింతూరు మార్చి 24.. మంగళవారం చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ( సిహెచ్ సి )లో ఒక అరుదైన మరియు క్లిష్టమైన శిశువు జననం చోటుచేసుకుంది. చింతూరు మండలంలోని ఎర్రంపేట గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ, సుమారు 6 నెలల గర్భంతో మూడు రోజుల క్రితం చెకప్ కోసం సిహెచ్ సి కు వచ్చారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న డాక్టర్ రమణరావు ఆమెను పరిశీలించి, గర్భంలోని శిశువుకు తీవ్రమైన అభివృద్ధి లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
వైద్యుల ప్రకారం, శిశువులో మెదడు, దాని చుట్టూ ఏర్పడవలసిన పుర్రె ఎముకలు సరిగా అభివృద్ధి చెందకపోవడం (అనేన్సఫెలీ ) వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో శిశువు పుట్టిన వెంటనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు .
ఈ కేసు పిండంలో ఉన్న తీవ్రమైన పుట్టుకలోపాల కారణంగా అత్యంత క్లిష్టంగా మారింది. ముఖ్య లోపాలు: పుర్రె ఎముకలు సరిగా అభివృద్ధి చెందకపోవడం మెదడు కణజాలం బయటకు కనిపించడం, మెనింగోమైలోసెల్ అనుమానం,తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం, ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో, సిహెచ్ సి వైద్య బృందం తక్షణమే స్పందించి అత్యవసరంగా లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ ( ఎల్ ఎస్ సి ఎస్ ) శస్త్రచికిత్స నిర్వహించి తల్లి ప్రాణాలను విజయవంతంగా కాపాడింది.ఈ అరుదైన, సవాలుతో కూడిన కేసును సమర్థవంతంగా నిర్వహించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది సేవలను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

