
Arrest and Detention : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు —సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం హైదరాబాద్ లో నిర్మించాలి.
సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర చందు నాయక్.
దేవరకొండ డివిజన్ మార్చ్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, తెల్లవారుజామున దేవరకొండ పట్టణ పోలీస్ అధికారులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి నిర్బందిచడం దారుణం ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తూ సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ..కొర్ర చందు నాయక్ మాట్లాడుతూ..
గిరిజన లంబాడి అన్ని సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి లంబాడీల కోరిన చోట సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయాలి లంబాడీల ఆత్మగౌరవం సేవలాల్ పుణ్యక్షేత్రం అడవిలోన్న హైదరాబాదులోనా ఈనెల 25న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కొర్ర చందు నాయక్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరగా తెల్లారు జామున దేవరకొండ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్భదిచడం జరిగింది మీరెన్ని అరెస్టు చేసిన మా ఉద్యమాలు ఆగవు ప్రజా సమస్య కొరకు సేవాలాల్ విగ్రహం ప్రతిష్టాపన హైదరాబాదులో పెట్టేంత వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు .
ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం లంబాడ హక్కుల పోరాట సమితి, సేవలల్ సేన, గిరిజన జన సమితి, లంబాడి సేన నాయకులకు జై సేవాలాల్ నినాదాలు పలుకుతూ ఎన్ని అడ్డంకులు వేసినా ముందు అడుగు వేయాలని నాయకులకు కోరుతూ అసెంబ్లీ ముట్టడిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు అని చందు నాయక్ అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

