ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Tahsildar and VRO Suspended

Tahsildar and VRO Suspended : త్రినేత్రం న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై. వెంకటేశ్వర్లు, మూలపాడు వీఆర్వో నరేంద్రలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు… తహసీల్దార్ కార్యాలయంలో భారీ అవినీతి జరుగుతోందని, రూ. లక్షలు తీసుకుని ఎఫ్ఎంసీలు (FMCలు) మంజూరు చేస్తున్నారని, కొటికలపూడి గ్రామానికి చెందిన ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ఎఫ్ఎంసీ మంజూరు చేశారని…

అలాగే మూలపాడు వీఆర్వో నరేంద్రతో కలిసి పలు అక్రమాలకు పాల్పడినట్లు వెలువడిన కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు… విచారణలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో నరేంద్రపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో వారిద్దరినీ తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఉత్తర్వులు జారీ చేశారు…

ఈ చర్యతో రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసినట్లైంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page