
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ బి హెచ్ పద్మప్రియ
- జర్నలిజం విద్యార్థుల ఆత్మీయ సత్కారంలో దిశా నిర్దేశం.
Aspire to Establish Yourselves : కూకట్పల్లి, సెప్టెంబర్ 16 త్రినేత్రం న్యూస్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం, రంగస్థల కళల శాఖాధిపతి ఆచార్య బి.హెచ్. పద్మప్రియకు జర్నలిజం విభాగ విద్యార్థులు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల స్థాయిలో ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేసిన నేపథ్యంలో విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమై ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సన్మాన సభలో ఆచార్య పద్మప్రియ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ దర్పణంగా నిలుస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ అధ్యాపకుల నుంచి సబ్జెక్టు పరమైన నాలెడ్జ్‌ను పూర్తిస్థాయిలో గ్రహించాలని సూచించారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణలతో భవిష్యత్తులో ఉత్తమ జర్నలిస్టులుగా సమాజంలో స్థిరపడి, రాబోయే తరాల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం డాక్టర్ షేక్ హసీనా, డాక్టర్ షేక్ సమీర్, డాక్టర్ వెంకటేశ్వరరావులతో పాటు సిబ్బంది లత, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఆచార్య పద్మప్రియను ఘనంగా సత్కరించారు. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, విద్యా రంగంలో మరిన్ని బాధ్యతాయుతమైన పదవులను చేపట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe