Health Camp : స్వస్థనారి, సశక్త్ పరివార్, అభియాన్, ఆరోగ్య శిబిరం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, 27.09.2025 న మన రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి స్వస్థనారి సశక్తె పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి తన 75 వ పుట్టిన రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశ వ్యాప్తంగా సుమారు లక్ష శిబిరాలు నిర్వర్తించడమే ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం ఈ కార్యక్రమం పిల్లలు మరియు మహిళలు ఆరోగ్యం పై దృష్టి పెట్టడం. ఇందులో సాధారణ ఆరోగ్య పరీక్షలు మరియు గర్భాశయ వ్యాధులు, స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి. తగిన చికిత్స ప్రకారం మెడిసిన్స్ అందచేయడం. కాబట్టి మన కూటమి నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలియపరుస్తున్నాను.

ఈ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రాంబాబు , వట్టికూటి దత్తుడు, గన్ని పెద్దబాబి, షేక్ మీరాభాయ్, బొప్పన లోవరాజు, హనుమంతు,తులూరి శేషు, తులూరి యేసు,పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి రాఘవ, ప్రభుత్వ డాక్టర్లు,వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు, సుభద్ర, అనురాధ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనుపమ, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swasthanari, Sashakte Parivar, Abhiyan

You cannot copy content of this page

Scroll to Top