అల్లూరిజిల్లా అరకులోయ నవంబర్ 7, (త్రినేత్రం న్యూస్): అరకువ్యాలీ మండల పరిధిలో క్యాంపింగ్ టెంట్లు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి అని సీఐ హిమగిరి తెలిపారు, సంబంధిత పంచాయతీ లేదా ఎంపీడీవో ఆఫీస్ నుండి పర్మిషన్ అవసరం. అలానే సైట్ చుట్టూ ఫెన్సింగ్, స్నేక్ పిట్, సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్టింగ్యూషర్ తప్పనిసరి.
క్యాంప్‌ఫైర్ టెంట్లకు 30 మీటర్ల దూరంలో చేయాలి. మద్యం, డీజే సౌండ్స్ పూర్తిగా నిషేధం. టెంట్లు ఇచ్చే ముందు ఐడీ ప్రూఫ్ తీసుకుని రికార్డులు మెయింటైన్ చేయాలి. మైనర్లకు, అవివాహిత జంటలకు టెంట్లు ఇవ్వరాదు తెలిపారు,
ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అరకువ్యాలీ పోలీసు వారు హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


