అల్లూరిజిల్లా అనంతగిరి, నవంబర్ 7 (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం గ్రామంలో విద్యుత్ సౌకర్యాన్ని ఘనంగా ప్రారంభించారు. యలమంచిలి శాసనసభ సభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ గ్రామానికి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదని తెలుసుకుని చలించిపోయారు. ఇరవయ్యో శతాబ్దంలో కూడా ఇలాంటి గ్రామాలు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండటం బాధాకరం. మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం గిరిజన యువత జనసేనాని అడుగుజాడల్లో ముందుకు సాగుతోంది,” అని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. “రాజకీయాలకన్నా ప్రజా సేవే గొప్పది. నీతి, నిజాయితీతో పనిచేస్తే ప్రజల ఆశీర్వాదాలతో గొప్ప నాయకులుగా ఎదగవచ్చు,” అని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
గూడెం గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడి అంగన్‌వాడీ భవనం, పాఠశాల భవనం సంయుక్తంగా నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, అలాగే గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు 7 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి అంశాలను చర్చించి త్వరలో అమలు చేసేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెట్టి చిరంజీవి, శ్రీనివాస్ రెడ్డి, ఐటీ ఇన్‌చార్జి డి. నవీన్ కుమార్, అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి, జనసేన నాయకులు పాంగి లక్ష్మణ్, రొంపల్లి పంచాయతీ నాయకులు కళ్యాణ్, పైడితల్లి, టీడీపీ నాయకురాలు నిర్మల, లక్ష్మి, అలాగే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు, ఇంజనీరు అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


