అల్లూరి జిల్లా అనంతగిరి, నవంబర్ 7, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని దాయర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరింది. వర్షాకాలంలో కారిపోవడం,తో స్కూల్ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉండడం వలన ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందో అనే భయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
భవనం పూర్తిగా ఉపయోగానికి పనికిరాకపోవడంతో, ప్రస్తుతం విద్యార్థులను గ్రామంలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే చదివిస్తున్నారు. ఈ తాత్కాలిక ఏర్పాటుతో విద్యార్థులు బిగువైన గదిలో తగిన సౌకర్యాలు లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ, “ప్రతి రోజూ స్కూల్ కి వెళ్లిన మన పిల్లలు భద్రంగా ఇంటికి వస్తారా అనే ఆందోళన ఉంది. కొత్త పాఠశాల భవనం నిర్మించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
స్థానిక ప్రజలు కూడా విద్యార్ధుల భద్రత కోసం సంబంధిత విభాగ అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


