రాయవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జులై -30. పీ.డీ.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధూ మాట్లాడుతూ రాయవరం మండలానికి చెందిన మాచవరం గ్రామంలో జరిగిన ఈ ఘటన పట్ల పీ.డీ.ఎస్.యూ విద్యార్థి సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల మైనర్ బాలికను మోసం చేసి లైంగికంగా దోచుకొని గర్భవతిని చేయడం పట్ల విద్యార్థి సమాజం ఉగ్ర ఆవేశంతో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యార్థులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్గదర్శి స్కూల్ కరస్పాండెంట్ షాజ్ జయరాజుని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు. రాయవరం మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం ఈ ఘటనలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థి సంఘ నాయకులు బుదవారం మాచవరం అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతా రాజారెడ్డి, కె. నవీన్, గుణం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


