జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్…
ఆత్రేయపురం :త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జులై .30. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన సహకార సంఘాల ద్వారా వారికి సక్రమమైన సేవలు కల్పించడంలో పాలకవర్గాలు ముందుండాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ శ్రీ ఉమా కమాండలేశ్వర ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. సహకార సంఘం అధ్యక్షునిగా మెర్ల నాగేశ్వరరావు సభ్యులుగా పసుపులేటి లోవరాజు అడబాల దుర్గారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ సహకార సంఘాలపై గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పలు సహకార సంఘాలు నష్టాలు ఊబిలోనికి చేరుకున్నాయని అయితే ర్యాలీ సహకార సంఘం మాత్రం లాభాల బాటలో నడుస్తుండడం అభినందనీయమని ఆయన అన్నారు.
ఇటువంటి సహకార సంఘం పాలకవర్గముగా నియమితులైన నూతన చైర్మన్ సభ్యులు ఈ సంఘం మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని వాటిని రైతులకు సక్రమంగా అందించే విధంగా పాలకవర్గాలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చేకూరి కృష్ణంరాజు, సూరపరెడ్డి సత్య, తోట స్వామి, కంఠంశెట్టిచంటి, బొక్క ఆదినారాయణ, బండారు బాబి, గారపాటి శ్రీనివాస్ చౌదరి, నల్ల వెంకన్న, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, నామాల ఏసు, బిం దేల గురవయ్య, వీర మహిళలుతదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


