Sri Sri Satya Deva Productions : శ్రీ శ్రీ సత్య దేవా ప్రొడక్షన్స్.. ప్రొడక్షన్ నెం 1 ఆవిర్భావం

TRINETHRAM NEWS

డొక్కా సీతమ్మ జీవిత కథనంతో దసరాకి కొత్త చిత్రం

తొలి చిత్రం డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
Trinethram News : రాజమహేంద్రవరం, గోధూళి మే 12: పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరం లో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆర్యా పురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సోమవారం సాయంత్రం పూజలు చేశారు. కోనసీమలో ఆంధ్రుల అన్నపూర్ణ గా పేరు గాంచిన డొక్కా సీతమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియా తో మాట్లాడారు. ప్రోడక్షన్స్ నిర్మాత శ్రీనివాసరావు పూతి, డైరెక్టర్ మురళీ చిరువోలు, రైటర్ మురళీ రమేష్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర బయోగ్రఫీ తీయాలానే సంకల్పం తో నిర్ణయించాము. గోదావరి జిల్లాలలో ఆమె చేసిన సామాజిక ఆలోచన, ప్రేరణ గా నిలిచి ఆమె చరిత్ర నేటి తరం ప్రజలకు తెలియాలానే మహోన్నతమైన చరిత్ర ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఉన్నామన్నారు. భారీ తారాగానం, భారీ బడ్జెట్ తో తీయాలానే నిర్ణయించామన్నారు. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి దసరా నాటికి పూర్తి చేసి విడుదల చేయాలని శంకల్పించామన్నారు. డొక్కా సీతమ్మ కుటుంబం ఆమె భర్త తో కలసి నిత్య అన్నదాత గా ఎలా చేశారు అనేది చిత్రంలో చేపిస్తామ్మన్నారు. త్వరలో మరిన్ని పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 150 సంవత్సరాల క్రితం అడిగిన వారికి లేదు అనుకుంటా అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ జీవిత కథనం ను చిత్ర రూపం లో తెర పైకి రానుంది. సోమవారం రాజమహేంద్రవరం స్థానిక ఆర్యపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత, దర్శకుడు, రైటర్ పాల్గొని డొక్కా సీతమ్మ జీవితంలో తెరపైకి తీసుకురావడానికి గల కారణాలు, ఆమె పడిన ఇబ్బందులు, ఆమె ఫేస్ చేసిన అనుభవాలు చిత్ర రూపంలో వీక్షకులకు పరిచయం చేయడానికి తమకెంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. చిత్ర నిర్మాణం భారీ స్థాయిలో ఉంటుందని, భారీ స్థాయిలో పెద్ద నటులతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళుతున్నట్టు వారు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Sri Satya Deva Productions..

You cannot copy content of this page

Scroll to Top