మాజీ మంత్రి విడుదల రజని, పట్ల పోలీసులు ప్రవర్తన సరైనది కాదు.
అనపర్తి : త్రినేత్రం న్యూస్ : అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ కన్వీనర్ కొండేటి భీమేశ్వర స్వామి
అనపర్తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీలకు రక్షణ కరువైందని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ కన్వీనర్ కొండేటి భీమేశ్వర స్వామి పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా మానుకొండ వారి పాలెం లో జరిగిన ఘటన దీనికి ఉదాహరణ అని అన్నారు. సోమవారం అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో భీమేశ్వర స్వామితో పాటు పలువురు నాయకులు విలేకరులతో మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి విడదల రజని పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి తన అనుచరులతో కలిసి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు రజని కారుని అడ్డుకుని తన కారులో ఉన్న అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో.. మాజీ మంత్రి రజని గారిపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ కాంత్ ను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె ప్రశ్నించి అడ్డుకోవడంతో.. ఆమె మహిళ, ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆమెను నెట్టి వేసిన పోలీసుల ప్రవర్తనా తీరు కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది.
ఈ విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలు అనే గౌరవం కూడా లేకుండా కనీస రాజ్యాంగ నిబంధనలు, చట్ట నియమ నిబంధనలు పాటించకుండా పోలీసులు ఏక పక్షంగా ఎవరో మెప్పు కోసం మహిళలు పట్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బండారు శ్రీనివాస్ , తుమ్మ రాజేశ్వరి, సత్తిబాబు, బీసీ సెల్ నాయకులు చింతా రామారావు, చిట్టూరి ఏసు తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


