చింత పల్లి మార్చ్ 10, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల వార్షిక (జాతర ) బ్రహ్మోత్సవాలలో దేవరకొండ శాసన సభ్యులు నేన్నావత్ బాలు నాయక్ పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండి ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , యువజన నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


