Shiva Abhishekam : పాప కర్మల నుండి విముక్తి కలిగించేది శివ అభిషేకం

TRINETHRAM NEWS

శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా.

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి .. తీదేడు గ్రామ సర్పంచ్.

చింత పల్లి మార్చ్ 04, త్రినేత్రం న్యూస్. శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అభిషేకాలు ఘనంగా ప్రారంభమైనయని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం స్వామి వారికి అభిషేకం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నో సమస్యలు తో బాధ పడుతూ ఏది కలిసిరాక ఇబ్బందులు పడుతూ ఏ పాపము చేసాము అని బాధ పడుతుంటారు చాలా మంది..ఒక వేళ నిజంగా ఏదైనా పాప కర్మ ఉండచ్చు లేకపోవచ్చు ఒక వేళ ఉంటే ఎటువంటి పాప కర్మ నుండి అయినా విముక్తి కలిగించేది శివుని అభిషేకమని ఆమె అన్నారు.

శివుడు ఐశ్వర్య కారకుడు ఎన్నో ఆటంకాలు తొలగించి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ వ్రతాలు, గండదీపాలు మరియు మొక్కులు చెల్లించుకుంటరని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు, మాజీ పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, ఆలయ పురోహితులు సురభి ప్రభాకర్ శర్మ,గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్,మర్రు పవన్ కుమార్,రెడ్డి పరమేష్ ముదిరాజ్,ఉడుత శంకరయ్య,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shiva Abhishekam

You cannot copy content of this page

Scroll to Top