తేదీ : 29/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి టిడిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏడాది పాలనపై పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి , విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా. లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు.అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఒకరికొకరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం జరిగింది. పాలనపై ఆసక్తికర సంభాషణ కొనసాగింది. జిల్లా స్థితిగతులపై చర్చించుకున్నారు. రెండు వేల ఇరవై నాలుగు వ సంవత్సరం ఎన్నికల్లో ఊహించని విజయం వెనుక కార్యకర్తల కష్టం, ఎంతో ఉందని, క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ వల్లే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడిందని అభిప్రాయపడ్డారు.
నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. టిడిపికి నాలుగు దశాబ్దాలుగా సీనియర్ నాయకులు అండగా నిలిచారని, వాళ్ల అనుభవాన్ని యువత శక్తిని జోడించి ముందుకు నడపవలసిన అవసరం ఉందని అన్నారు. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి సత్కరించాలని తెలిపారు. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాలని ఇరువురు మంత్రులు మాట్లాడుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


